Puma Elsu v2 SL DP Sneakers

Thamanna To Romance With Top Heroine Father

Thamanna To Romance With Top Heroine Father

 



సినిమాలోకి కొత్త తరాల నటులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నారు. ఇది ఇలా ఉంటే పాత తరం హీరోలెవ్వరు అంత త్వరగా రిటైర్ అవ్వడంలేదు. కొడుకులు, మనవళ్ళు పుట్టాక కూడా సినిమాలల్లో నటిస్తున్నారు కొందరు హీరోలు. విషయానికొస్తే ఇప్పుడు టాప్ పోసిషన్ లో ఒక హీరోయిన్ మరో టాప్ హీరోయిన్ తండ్రితో రొమాన్స్ చేయడానికి సిద్దమవుతుంది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో చేస్తూ, దాదాపు అందరి హీరోల సరసన నటించేందుకు, తమన్న మూవీలను సెలక్ట్ చేసుకుంటుంది. అందులోని భాగంగానే లెజండ్రీ హీరో కమల్ హాసన్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది.యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సీనియర్ డైరెక్టర్ మౌళి రాసిన కథతో ఓ సినిమాని చేయనున్నాడు. ఈ సినిమాలో కమల్ కి జోడీగా తమన్న నటిస్తుంది. మొదట కమల్ సరసన నటించేందుకు డేట్స్ లేవు అన్న తమన్న, తరవాత మాత్రం డేట్స్ ఉన్నాయంటూ కమల్ సరసన బెర్త్ ని ఫిక్స్ చేసుకుంది. సాధారణంగా కమల్ పక్కన నటించిన ఏ హీరోయిన్ కి అయినా మంచి పాపులారిటీ రావడం ఖాయం.అందుకే తమన్నా తన షెడ్యూల్ ని కుదుర్చుకుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

Add a Comment